నబీల్ ఇచ్చిన ట్విస్ట్.. ఒక్కరు తప్ప అందరు నామినేషన్లో!
on Dec 3, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో సోమవారం నామినేషన్ ప్రక్రియ వెరైటీగా సాగింది. బిగ్ బాస్ మొదటగా సెకెంఢ్ ఫైనలిస్ట్ ఎవరో చెప్పమని హౌస్ మేట్స్ కి చెప్పాడు. ఇక అందరు తమ ఫోటోలని కాల్చేసుకున్నారు.
చివరిగా ప్రేరణ-నబీల్ ఫొటోలు మాత్రమే మిగిలాయి. ఇక వీరిద్దరిని యాక్టివిటీ ఏరియాకి పిలిచి ఓ ఆఫర్ ఇచ్చాడు బిగ్‌బాస్. మీ ఎదురుగా రెండు బ్లాంక్ చెక్‌లు ఉన్నాయి. మీలో ఒకరికి మాత్రమే సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అది మీకు కావాలంటే బ్లాంక్ చెక్ మీద రూ.15 లక్షల వరకు ఎంతైనా రాసివ్వండి.. ఎవరు అయితే ఎక్కువ అమౌంట్ రాస్తారో వాళ్లకి సెంకడ్ ఫైనలిస్ట్‌గా అయ్యే అవకాశం దక్కుతుంది. కానీ మీరు రాసిన అమౌంట్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందంటూ షాకిచ్చాడు బిగ్‌బాస్. దీంతో చాలా సేపు ఆలోచించి ఇద్దరూ వాళ్లకి నచ్చినట్లు అమౌంట్ రాశారు. అయితే అవినాష్, రోహిణి, నిఖిల్ అయితే నబీల్ ఏం రాయడని బెట్ వేసుకున్నారు.
నబీల్-ప్రేరణ ఇద్దరినీ హౌస్‌మేట్స్ ముందు నిల్చోబెట్టి మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. వీళ్లిద్దరిని ఒప్పించి ఆ చెక్కులను చింపించే అవకాశం మీకు ఇస్తున్నా.. ఎందుకుంటే వాళ్లు రాసిన అమౌంట్ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో గౌతమ్, నిఖిల్ సహా అందరూ ప్రేరణ-నబీల్‌లను ఒప్పించే పనిలో పడ్డారు. ఇన్నాళ్లూ మీరు నామినేషన్స్ దాటుకొని ఇక్కడి వరకు వచ్చారు.. ఇప్పుడు మత్రం ఆ ఫైనలిస్ట్ టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది.. మీరు స్ట్రాంగ్ ప్లేయర్లు ఓటింగ్ ప్రకారం ఫినాలేలోకి వస్తారని చెప్పడంతో ఇద్దరు ఒప్పుకొని చెక్కులు చింపేశారు. అయితే చింపేసే ముందు ఎవరు ఎంత రాశారో చూపించారు. ప్రేరణ 4 లక్షల 30 వేలు రాయగా, నబీల్ మొత్తం 15 లక్షలు రాసేశాడు. ఇది చూసి అందరూ అవాక్కయ్యారు. ఇక నిఖిల్ అయితే చెక్ నబీల్ చేతిలో ఉన్నప్పుడు లవ్ యూ నబీల్ అని అన్నాడు. చెక్ గ్రైండర్ మిషన్ లో వేయగానే హేట్ యూ నబీల్ అన్నాడు. దాంతో నబీల్, ప్రేరణ ఇద్దరు కూడా నామినేషన్లోకి వచ్చేశారు. సెకెంఢ్ ఫైనలిస్ట్ ఇంకా ఎవరు అవ్వలేదు. దాంతో ఈ వారం అవినాష్ తప్ప హౌస్ మేట్స్ అంతా నామినేషన్లో ఉన్నారు.
Also Read